పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పలు బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ చిత్రాల్లో సలార్ (Prabhas Salaar) కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ వైలెంట్ యాక్షన్ డ్రామా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఆ మధ్య కొన్ని రూమర్స్ ఈ జనవరి ఎండింగ్ కి సలార్ 2 పై వస్తుంది అన్నట్టు వైరల్ గా మారాయి. వీటితోనే ఓ షాకింగ్ రూమర్ ఈ సినిమా ఇక లేదు ఆగిపోయింది అన్నట్టు కూడా స్టార్ట్ చేశారు.
కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ రూమర్ కి మేకర్స్ చెక్ పెట్టారు. ఈ సినిమా బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) కి బర్త్ డే విషెస్ చెబుతూ శౌర్యంగ పర్వం ఎదురు చూస్తుంది అని సలార్ 2 (Salaar 2 Shouryanga Parvam) సెట్స్ లో మిమ్మల్ని చూసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా తెలిపారు. సో సలార్ 2 ఆగిపోయింది, నిలిచిపోయింది అని స్ప్రెడ్ చేసిన రూమర్స్ ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Here’s wishing our coolest Aadya, @shrutihaasan a very Happy Birthday.
Looking forward to Shouryaanga Parvam and seeing you back on the sets of #Salaar2. pic.twitter.com/Xfhvu70CMt— Salaar (@SalaarTheSaga) January 28, 2026
