టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం తన కెరీర్‌లోని ల్యాండ్ మార్క్ 100వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక తన 100వ చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ నటించాలని కోరుకుంటున్నట్లు నాగ్ వెల్లడించారు. సీనియర్ బ్యూటీ టబుతో నాగ్‌కు మంచి స్నేహం ఉంది. వారిద్దరు చాలా ఏళ్లుగా ఒకరికొకరు పరిచయం. అయితే, నాగ్‌తో పలు సినిమాల్లో నటించిన టబు, ఇప్పుడు నాగ్ 100వ చిత్రం గురించి తెలుసుకుంది. దీంతో ఆయన ల్యాండ్ మార్క్ మూవీలో తనకు ఓ పాత్ర కావాలంటూ నాగ్‌ను కోరిందట.
దీంతో నాగ్ 100వ చిత్రంలో టబు ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
