అక్కినేని కుటుంబం నుంచి యువ హీరోలు అఖిల్ అక్కినేని అలాగే అక్కినేని నాగ చైతన్య ఇద్దరూ తండేల్ అలాగే లెనిన్ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాకి ఉన్నది వీరిద్దరికీ మంచి సినిమాలు అందించడంలో సహకారం అందించిన వారి తండ్రి అక్కినేని నాగార్జున మాత్రమే అని చెప్పాలి.
అక్కినేని నాగార్జున కెరీర్ లో 100వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ గ్యాప్ లో మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. దర్శకుడు ఆర్ ఏ కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అని మేకర్స్ బిగ్ అప్డేట్ ఇప్పుడు అందించారు.
దీనితో మ్యూజికల్ ర్యాంపేజ్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఆల్రెడీ దేవిశ్రీప్రసాద్, నాగార్జున కలయికలో సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
