అఫీషియల్: మరోసారి ధనుష్ తో నాగవంశీ.. ఈసారి థ్రిల్లర్?

టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ఇప్పుడు వరుసగా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ధనుష్ ఇటీవల చేసిన హిట్ చిత్రాల్లో సార్ కూడా ఒకటి. తెలుగు దర్శకుడు, నిర్మాతతో కలిసి చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాత నాగవంశీతో ధనుష్ ఓ సినిమా ఉంటుంది అని తెలిపాము. ఇక ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. ధనుష్ కెరీర్ 59వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో థ్రిల్లర్ ని తీసుకొస్తున్నారా అనిపిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ బి కుమార్ తెరకెక్కించనుండగా కన్నప్ప, రీసెంట్ బ్లాస్ట్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండడం విశేషం. అలానే ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

Exit mobile version