మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ ఓ తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపు 80 శాతం పూర్తయ్యి మిగతా షూట్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
అయితే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి ని వీరే డిస్ట్రిబ్యూషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్ది తో రాబోతున్నారు.
మరి ఈ సినిమాకి ఎలాంటి ప్లానింగ్, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. అలాగే యూఎస్ లో ఏప్రిల్ 29 ప్రీమియర్స్ తో మొదలు కానుంది.
For the first time ever, we join forces with MEGA POWER STAR @AlwaysRamCharan garu❤️🔥
With great pride, we bring #PEDDI – a story forged in grit, guts and glory to North America audiences🔥
Heartfelt thanks to @vriddhicinemas @venkataskilaru garu for believing in us.
MASSIVE… pic.twitter.com/MiIIiA1yKs
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 27, 2026
