అఫీషియల్: ‘బాలయ్య 111’ మాస్ బొమ్మకి ఓటిటి పార్ట్నర్ లాక్.. ఎవరికి సొంతం అంటే!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ కీలక పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 111 వ సినిమాగా చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

ముంబై షెడ్యూల్ తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటిటి డీల్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ మీ ముందుకు మేము తీసుకొచ్చాము. ఇప్పుడు దీనిపై అధికారిక క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 వారు ఫాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్టు తెలిపాము.

లేటెస్ట్ గా జీ 5 వారు తమ రానున్న కంటెంట్ తాలూకా లిస్ట్ లో బాలయ్య 111 సినిమా కూడా ఉన్నట్టు రివీల్ చేశారు. సో బాలయ్య బ్లాస్టింగ్ బొమ్మని జీ 5 వారు థియేట్రికల్ రిలీజ్ తర్వాత తీసుకురానున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version