ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో చేస్తున్న సినిమా “స్పిరిట్” ( Spirit )కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ప్రభాస్ సహా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నడుమ సన్నివేశాలతో షూట్ మొదలైనట్టు టాక్ వచ్చింది.
అయితే ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్టు కొన్ని రూమర్స్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ది ఎంత కీలక పాత్ర అనేది వాయిస్ టీజర్ తోనే చాలా మందికి అర్ధం అయ్యింది. అలాంటిది తన రోల్ ఉండదు అనే టాక్ ఏ మేరకు నిజం అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
