పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న నెక్స్ట్ అవైటెడ్ సినిమానే ఓజి పార్ట్ 2. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల హైప్ అంతా ఇంతా కాదు. ఇలా భారీ అంచనాలతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది బ్లాస్ట్ లా మారుతుంది. ఈ నేపథ్యంలో ఓజి 2 డిస్కషన్స్ కూడా మొదలైన నేపథ్యంలో సినిమా షూట్ కి సంబంధించిన రూమర్స్ కూడా మొదలయ్యాయి.
నిజానికి ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్టు ముందు బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు మూమెంటం చూస్తే సినిమా ఇంకా ముందే మొదలయ్యే అవకాశం ఉందట. అలాగే సుజీత్, పవన్ లు కలిసి ఒక్కసారి చివరి సిట్టింగ్ లో కథ విషయంలో ఓ కొలిక్కి కూడా వస్తారని తెలుస్తోంది. సో ఓజి 2 విషయంలో ఫ్యాన్స్ కి ముందు రోజుల్లో ఊహించని ట్రీట్ గ్యారెంటీ అనుకోవాలి.
