మలయాళ హిట్ పెయిర్ తెలుగులో హిట్ అవుతారా.?

ok-bangaram
సినీ రంగంలో కాంబినేషన్స్ అనేవి అభిమానుల్లో అంచనాలను పెంచుతాయి, అలాగే ఒక హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటే ఆ సినిమా బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది. అలాంటి ఓ హిట్ అండ్ క్రేజీ కాంబినేషన్ లో ఈ వారం ఓ సినిమా రానుంది. ఆ సినిమా పేరే ‘ఓకే బంగారం’. మలయాళ సూపర్ స్టార్ దల్క్వేర్ సల్మాన్, మలయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇక్కడ విషయం ఏమిటంటే మలయాళంలో దల్క్వేర్ సల్మాన్ – నిత్యా మీనన్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఉస్తాద్ హోటల్’, ‘100 డేస్ అఫ్ లవ్’, ‘బెంగుళూరు డేస్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న తొలి తెలుగు సినిమా ఓకే బంగారం. ఇప్పటికే టైలర్స్ లో ఆకట్టుకున్న ఈ ఇద్దరూ సినిమాలో కూడా అదెలా మెప్పిస్తారా.? తెలుగులో కూడా అదే మేజిక్ ని రిపీట్ చేసి తెలుగులో కూడా సూపర్ హిట్ పెయిర్ అనిపించుకుంటారా.? లేదా అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..

ఓకే బంగారం డైరెక్టర్ మణిరత్నం కూడా నేటి తరానికి పర్ఫెక్ట్ గా సరిపోయే యూత్ ఫుల్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని తెలుగు దిల్ రాజు అందిస్తున్నాడు.

Exit mobile version