మరోసారి వాయిదాపడనున్న ఒక లైలా కోసం…

okalila-kosam
ప్లాన్ ప్రకారం ఆగష్టు 29న విడుదలకావాల్సిన ‘ఒక లైలా కోసం’ సినిమా రభస చిత్రం కారణంగా వాయిదా పడింది. ఈ రభస సినిమా తరువాత నుండి వరుసపెట్టి పెద్ద సినిమాలు విడుదల కావడంతో మన చైతు సినిమా మరింత వాయిదా పడినట్టు, ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలోనో, నవంబర్ మొదటి వారంలోనో విడుదలచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ ఆగడు మానియా, తరువాత చెర్రీ గోవిందుడి హంగామా వున్న కారణాన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది

గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన విజయ్ కుమార్ కొండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగ చైతన్య సరసన పూజా హేగ్దే నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా నాగార్జున ఈ సినిమాను నిర్మించారు

Exit mobile version