టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’

naga-chaitanya
యంగ్ నాగ చైతన్య వరుసగా ఒకదాని తర్వాత ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే నాగ చైతన్య నటించిన ‘మనం’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ వారం అనగా మే 23న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది రిలీజ్ కాకముందే నాగ చైతన్య తన తదుపరి సినిమా ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ ని కూడా చివరి దశకు తెచ్చేసాడు.

ఈ రోజుతో ‘ఒక లైలా కోసం’ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం కొన్ని సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ‘ఒక లైలా కోసం సినిమా టాకీ పార్ట్ నేతితో పూర్తయ్యింది. ఇక సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉందని’ హీరోయిన్ పూజ హెగ్డే ట్వీట్ చేసింది.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది. వచ్చేనెల చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

Exit mobile version