
‘ఒక లైలా కోసం’ అంటూ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్కినేని యువ కెరటం నాగ చైతన్య. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కింగ్ నాగార్జున నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే, విడుదలకు మంచి ముహూర్తం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అక్టోబర్ మూడవ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతున్నట్టు ప్రకటించారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెడ్గే జంటగా నటించింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. ఆగస్ట్ లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు శ్రోతలకు చేరువయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని దర్శకనిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.