ఎం.వెంకట్ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం ‘ఒకటే లైఫ్’. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. శృతి యుగల్ హీరొయిన్‌గా నటిస్తొన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకానుంది.
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం.. హ్యూమన్ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి చాలా మంచి సినిమా తీసావు అని మమ్మల్ని మెచ్చుకున్నారు. అని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది అన్నారు.
నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. ట్రైలర్ లు పాటలు చాల బాగావచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ లు మంచి రేటుకు సినిమా ని అడుగుతున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము అన్నారు.
