మరోసారి కార్తీ ఆశ్చర్యపరచనున్నాడా.?

లేటెస్ట్ గా తెలుగు సహా తమిళ్ లో సూపర్ గా నిలిచినటువంటి చిత్రాల్లో టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “సర్దార్” కూడా ఒకటి. మరి హీరోగా మంచి కం బ్యాక్ ని మళ్ళీ అందుకున్న తాను నెక్స్ట్ అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రెడీగా ఉన్నాడు. మరి లేటెస్ట్ గానే యంగ్ దర్శకుడు రాజు మురుగన్ తో “జపాన్” అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా కూడా లాక్ అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరోసారి కార్తీ ఆశ్చర్యపరచనున్నాడని తెలుస్తుంది. ప్రయోగాత్మకంగా కార్తీ తన సర్దార్ లో డిఫరెంట్ గెటప్స్ తో కనిపించి అలరించాడు. అలాగే అప్పట్లో కాష్మోరా సినిమాకి కొత్త మేకోవర్ చూపించాడు. మరి అలాగే ఇప్పుడు జపాన్ లో కూడా కొత్త మేకోవర్ తో కార్తీ నటించనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు మొదలైంది.

Exit mobile version