మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై మొదటి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’తోనే సూపర్ హిట్ అందుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ఏడాది సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళి రెండు సినిమాల షూటింగ్ షూటింగ్ ఒకేసారి ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అవే ‘తిక్క’ మరియు ‘సుప్రీమ్’. ఈ రెండు సినిమాల తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు.
ఇదిలా ఉంటే తాజాగా తనకి ఫిస్ట్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరితో మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఎఎస్ రవికుమార్ చౌదరి ప్రస్తుతం గోపీచంద్ తో చేస్తున్న ‘సౌఖ్యం’ సినిమాని ఫినిష్ చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమాని జనవరిలో మొదలెట్టి సమ్మర్ కి రిలీజ్ చేసేసి, సమ్మర్ చివరి నుంచి సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు ఎఎస్ రవికుమార్ చౌదరి. దీనికి సాయి ధరమ్ తేజ్ కూడా సిద్దంగా ఉన్నాడు.
