రవి తేజ-గోపీచంద్ మలినేనిల మూవీ లేటెస్ట్ అప్డేట్

thaman

మాస్ మహారాజ్ రవితేజ,సంగీత దర్శకుడు థమన్ లది హిట్ కాంబినేషన్. థమన్ తెలుగులో కిక్ మూవీతో తన జర్నీ మొదలు పెట్టారు. సూపర్ హిట్టైన కిక్ మూవీలోని థమన్ అందించిన సాంగ్స్ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆతరువాత మిరపకాయ్, బలుపు వంటి రవి తేజ హిట్ చిత్రాలకు థమన్ స్వరాలు అందించారు. కాగా రవితేజ తన 66వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఠాగూర్ మధు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవి తేజ మరో మారు పోలీస్ గా కనిపించనున్నాడు. హీరోయిన్ గా శృతి హసన్ ని ఎంపిక చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ని ఎంపిక చేశారు. ఈ మేరకు నేడు అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. దీనితో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుందని సమాచారం. ఇక రవితేజ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించిన డిస్కో రాజా వచ్చే నెల 20న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో రవితేజ జంటగా పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా సంగీతం థమన్ అందించారు.

Exit mobile version