చిత్ర పరిశ్రమలో అదృష్టాన్ని, సెంటిమెంట్స్ ని గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు . దర్శక నిర్మాతల నుండి హీరోల వరకూ సెంటిమెంట్ అనేది చాలా సీరియస్ విషయం. అందుకే ఓ సారి మంచి హిట్ పడితే కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక టైటిల్స్ అందులోని అక్షరాల సంఖ్య వంటి విషయాలు కూడా ఈ సెంటిమెంట్ లో భాగమే. కాగా స్టార్ హీరోలు కొందరు నటులు తమ చిత్రంలో ఉంటే హిట్ ఖాయం అనే సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు.
కాగా సూపర్ స్టార్ మహేష్ కి కూడా ఓ నటుడంటే పిచ్చ సెంటిమెంట్ అట. ఆ నటుడు తన మూవీలో ఉంటే హిట్ ఖాయమట. మరి ఆ నటుడు ఎవరో కాదు.. బ్రహ్మజీ అట. బ్రహ్మాజీ నటించిన తన చిత్రాలు 99శాతం విజయం సాధించాయని మహేష్ 2018లో ఓ కార్యక్రమంలో తెలిజేశాడు. భరత్ అనే నేను చిత్ర విజయం తర్వాత మహేష్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలియజేయగా.. నిన్న కొరటాల శివ బర్త్ డే సంధర్బంగా ఈ విషయాన్ని బ్రహ్మజీ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Naa mithrudu..naa shreyobhilaashi ..sivudu ki jhanmadina subhakanshulu
????❤️????@Koratalasiva pic.twitter.com/0mG9sA7JYI— Brahmaji (@actorbrahmaji) June 15, 2020
