ఒడియన్ తో పరాజయాన్ని చవిచూసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘లూసిఫెర్’ తో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కేరళ ,యూఎస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం 8రోజుల్లోనే ఈచిత్రం 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం.
ఇక పులి మురుగన్ తరువాత ఈ ఫిట్ సాధించడం మోహన్ లాల్ కు ఇది రెండవ సారి. మాలీవుడ్ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ఎంటర్టైనెర్ లో వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఈనెల 12న తెలుగులో విడుదలకానుంది.
