ఆటోనగర్ సూర్య విడుదలకి మరో అడ్డంకి.!

ఆటోనగర్ సూర్య విడుదలకి మరో అడ్డంకి.!

Published on Jun 22, 2014 4:58 PM IST

auto-nagar-surya

చాలా కాలంగా విడుదలకి పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ‘ఆటోనగర్ సూర్య’ని ఎట్టకేలకు విడుదల చేయడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, జూన్ 27న రిలీజ్ చేస్తాం అని రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా మళ్ళీ సమస్యల్లో ఇరుక్కుంది.

ఇటీవలే గుంటూరుకి చెందిన మొహమ్మద్ అనే బిజినెస్ మాన్ వేసిన ఓ కేసు వల్ల ఈ సినిమా రిలీజ్ ని జూలై 10 వరకూ నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగానే ఇండస్ట్రీలోని జూనియర్ ఆర్టిస్టుల నుండి మరో సమస్య వచ్చి పడింది. ఈ సినిమాకి పనిచేసిన జూ. ఆర్టిస్టులు తమకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇంకా ఇవ్వలేదని ఫిల్మ్ చాంబర్ లో కంప్లైంట్ చేసారు. వీరికి రావాల్సిన అమౌంట్ ని సెటిల్ చేసాకే సినిమాని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా తాజాగా మరికొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల ఈ సారి అన్నా అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. మరి ప్రొడక్షన్ టీం అనుకున్న తేదీకి అన్నీ క్లియర్ చేసి సినిమాని రిలీజ్ చేస్తారేమో చూడాలి.

తాజా వార్తలు