తమిళ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ తన చిట్ట చివరి చిత్రమే జన నాయగన్ (Jana Nayagan). దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మన టాలీవుడ్ హిట్ చిత్రం భగవంత్ కేసరి కి రీమేక్ అని ఆల్రెడీ చాలా మందికి అర్ధం అయ్యిపోయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో జన నాయకుడుగా కూడా మార్చి రిలీజ్ కి తెస్తున్నారు.
అయితే దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వస్తుంది. మేకర్స్ కూడా విజయ్ చివరి సినిమా చివరి సంబరాలకు ఎక్కడా తగ్గడం లేదు. అయితే మలేషియాలో గ్రాండ్ గా ఈవెంట్ ని ప్లాన్ చేశారు. దీనికి ముందు అన్ని సినిమాలు కూడా తమిళ నాటే జరిగాయి కానీ ఈ సినిమాకి అక్కడ ప్లాన్ చేశారు.
Atlee, Lokesh, Nelson for Vijay – ఈ టాప్ 3 దర్శకులు విజయ్ కోసం
విజయ్ కి సెండాఫ్ ఇచ్చేందుకు జన నాయకుడు (Jana Nayakudu) టీం మొత్తంతో పాటుగా తన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ లు వచ్చారు. వీరు ముగ్గురూ రావడం ఫ్యాన్స్ కి ఆనందమే కానీ విజయ్ చివరి సినిమా కాబట్టి కేవలం వీరు ముగ్గురు మాత్రమే రావడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
విజయ్ కి లైఫ్ ఇచ్చిన దర్శకుణ్ణి మర్చిపోయారా?
విజయ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు వీరికి ముందూ ఉన్నారు. మెయిన్ గా ఈ కొన్నేళ్లలో ఏ ఆర్ మురుగదాస్ విజయ్ కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు తనకి కూడా ఇందులో చోటు దక్కలేదా? కత్తి, తుపాకీ, సర్కార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ని మురుగదాస్ అందించారు. అలాంటి తాను కూడా విజయ్ కి సెండాఫ్ ఇచ్చే ఈవెంట్ లో కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యం.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమిత బైజు కీలక పాత్ర చేస్తుంది. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
