లాభాల బాటలో ‘ఊహలు గుసగుసలాడే’

Oohalu-Gusagusalade
గత శుక్రవారం అనగా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. వారాహి చలనచిత్రం వారు ఈ సినిమాని నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా వారికి బాక్స్ ఆఫీసు వద్ద లాభాలను తెచ్చి పెట్టడమే కాకుండా లాంగ్ రన్ లో కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది. థియేటర్స్ రెవిన్యూ తో పాటు, శాటిలైట్ కి కూడా మంచి రేటు రావడంతో సాయి కొర్రపాటి చాలా హ్యాపీగా ఉన్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కళ్యాణి కోడూరి మ్యూజిక్ అందించాడు. నాగ శౌర్య,రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version