మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లలో నటుడు శివాజీ, హీరోయిన్ లయల కలయిక కూడా ఒకటి. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 2000స్ లో ఎంతగానో అలరించాయి. ఇక అక్కడ నుంచి కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వీరి కలయికలో వస్తున్న అవైటెడ్ సినిమానే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసనీ'(Sampradayini Suppini Suddapoosani). శివాజీ 90స్ బయోపిక్ లోని ఫేమస్ లైన్ తో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఫన్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ గా అనౌన్స్ అయ్యింది.
మొదట థియేట్రికల్ రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఫైనల్ గా ఈ సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాని ఈటీవీ విన్ వారే తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కి సిద్ధం చేశారు. ఈ సినిమాని ఈ ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ కి తెస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు రంజన్ రాజ్ సంగీత దర్శకుడిగా పని చేయగా శివాజీ సొంటినేని నిర్మాణం వహించారు.
