ఓటీటీ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఇరుముడి”

ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ కలయికలో చేసిన సినిమా “ఇరుముడి” కూడా ఒకటి. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాకి సాలిడ్ బుకింగ్స్ నమోదు చేసుకుంటుంది. మరి థియేటర్స్ లో రాణిస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ నుంచి నెక్స్ట్ ఓటీటీకి రావాల్సిందే.

థియేటర్ రిలీజ్ కి ముందు సినిమా ఓటీటీ పార్ట్నర్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. సో బిగ్ స్క్రీన్స్ పై ఎంటర్టైన్మెంట్ తర్వాత ఈ ఓటీటీలో సినిమా సందడి చేయనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version