ఓటీటీ : ‘కొరియన్ కనకరాజు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీ : ‘కొరియన్ కనకరాజు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Published on Aug 30, 2026 1:59 PM IST

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన బలమైన ప్రదర్శనను కొనసాగించింది. మొత్తానికి ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందింది, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ‘కొరియన్ కనకరాజు’ సెప్టెంబర్ 4, 2026న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం వివిధ భాషల్లో అందుబాటులో ఉంటుందా ? లేదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, చిన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. మరో ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు