ఈ మార్చ్ నెలలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు అవైటెడ్ చిత్రాల్లో మన తెలుగు నుంచి ఉన్న ఒకే ఒక్క పెద్ద చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓజి లాంటి హిట్ తర్వాత వస్తున్న ప్రాపర్ మాస్ సినిమా ఇది కాగా దీని కోసం ఫ్యాన్స్ మంచి హైప్ ని సెట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాకి ఆల్రెడీ దర్శకుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి వీటిలో ఈ సినిమా తాలూకా ఓటిటి డీల్ కోసం పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఈ సినిమాని ప్రస్తుతం దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారు కేవలం 20 నిమిషాల్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ డీల్ ని నిర్మాతలతో ముగించుకున్నట్టు తెలిపారు. తాను కట్ చేసి పెట్టుకున్న ఫుటేజ్ ని వారికి చూపించగా చూసిన నెట్ ఫ్లిక్స్ టీం వాళ్ళు కేవలం 20 నిమిషాల్లో డీల్ ఇచ్చేసినట్టు హరీష్ శంకర్ తెలిపారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ కంటెంట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఓటిటి రిలీజ్ పై కూడా మాట్లాడుతూ అది నిర్మాతల చేతిలో ఉంటుందని తనకి సంబంధం లేని విషయం అది అని తాను తెలిపారు.
