తెలుగుసినిమా కథలు కొన్నిచట్రాల్లో బిగుసుపోయిన టైంలో ‘‘పలాస 1978’’ అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచడానికి వస్తోంది ఈ సినిమా. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే సినిమాలో విషయం ఉందనిపిస్తోంది. బలమైన ఎమోషన్స్ చుట్టూ , సమాజంలో పేరుకుపోయిన అసమానతలుకు సంబంధించిన అంశాలను టీజర్ లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు.
కాగా రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. పైగా రఘు కుంచె ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు ఈ పాత్ర కథలో కీలకమవడంతో పాటు, బాగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలుస్తోంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
