‘పంతం’ నా కెరీర్లో మరో యజ్ఞం అవుతుంది – గోపిచంద్ !

Gopichand
నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో గోపిచంద్, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న విజయవాడలో ఘనంగా జరిగింది ఈ సందర్బంగా హీరో గోపిచంద్ మాట్లాడుతూ నాకు నా కెరీర్లో నాకు భాగా నచ్చిన చిత్ర ‘యజ్ఞం’. ఆ సినిమా తరువాత మళ్లీ అంతలా నచ్చిన సినిమా ‘పంతం’ అని అన్నారు. మంచి సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని అంటూ ఈ చిత్రం ఇంత భాగా రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు .

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమా ఫై అంచనాలను రెట్టింపు చేసింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం ఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు. గోపీపిచంద్ యొక్క 25 వ చిత్రంగా రానున్న ఈ సినిమా జులై 5న విడుదల కానుంది .

Exit mobile version