ఇంట్రెస్టింగ్ గా అనుపమ “పరదా” కాన్సెప్ట్ వీడియో!

బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ఈ బ్యూటీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాన్సెప్ట్ వీడియో ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో తో పాటుగా ఇంట్రెస్టింగ్ టైటిల్ పరదా ను ప్రకటించారు మేకర్స్.

రిలీజ్ చేసిన వీడియో ఆసక్తికరం గా ఉంది. ఇదొక డిఫెరెంట్ సబ్జెక్ట్ లా అనిపిస్తుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ దొంకడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version