‘పరదా’ స్పెషల్ ప్రీమియర్స్ ఫిక్స్.. బుకింగ్స్ షురూ..!

Paradha 0

ట్యాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేయగా ఈ చిత్రం సోషల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.

ఇక ఈ సినిమాను ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రం ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఆగస్టు 20న ఈ చిత్ర ప్రీమియర్స్ ఉండబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఏఎంబి, ఏఏఏ సినిమాస్‌లో ఈ చిత్ర ప్రీమియర్స్ ఉంటాయని.. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version