
నిన్న దీపావళి సందర్భంగా మన టాలీవుడ్ సినీ తారలు కూడా ఎంతో ఆనందంగా తమ పండుగను జరుపుకున్నారు. అలాగే ఒకరి నుంచి మరొకరు కూడా తమకు శుభాభినందనలు తెలియజేసుకున్నారు. మరి ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైనటువంటి పవర్ స్టార్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సహా మరో స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తన కుటుంబానికి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులు పంపడం జరిగింది.
పవన్ మరియు తన భార్య ఏనా లు మహేష్, నమ్రతలకు ఈ విషెష్ పంపడం జరిగింది. దీనితో ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసి థాంక్స్ చెప్పడంతో వైరల్ గా మారింది. దీనితో ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ తన “భీమ్లా నాయక్” సినిమా కంప్లీట్ చెయ్యడంలో బిజీగా ఉండగా మహేష్ బాబు తన భారీ సినిమా “సర్కారు వారి పాట” షూట్ లో బిజీ బిజీగా ఉన్నారు.