మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అపారమైన్ ప్రజాదరణ కలిగి ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి వీరిద్దరూ చేస్తున్న భారీ చిత్రాల కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలు ఎలాగో ఉండేవే కానీ ఈ మధ్య బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “RRR” యూనిట్ తమ విడుదల తేదీని ప్రకటించడంతో టాలీవుడ్ లో మిగతా అన్ని బడ్జెట్ సినిమాలు కూడా ఒక్కసారిగా వరుస పెట్టి తమ విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టాయి.
అయితే ఈ రేస్ లో మాత్రం ఇంకా పవన్ మరియు ప్రభాస్ సినిమాల పేర్లు యాడ్ అవ్వలేదు.పవన్ చేస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” అలాగే ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనితో బాకీ ఉన్న ఈ ఇద్దరి సినిమాలు ఏ డేట్ ను లాక్ చేసుకుంటాయో ఎప్పుడు విడుదల అవుతాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తికి తగ్గట్టుగానే మేకర్స్ ఇంకా హోల్డ్ లోనే ఉంచారు. మరి ఈ ఇద్దరి సినిమాల విడుదల తేదీలు ఎప్పుడు వస్తాయో చూడాలి.
