
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్వతహాగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఓ స్టార్.. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక హీరోగానే కాకుండా ప్రజల సంక్షేమం కోసం జనసేన పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తరపున ప్రజల కోసం పోరాడడానికి తనెప్పుడు సిద్దమే అని తెలిపాడు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వ్యవసాయదారుల కోసం ఏపి గవర్నమెంట్ తో మాట్లాడాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం పలువురు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పోరాడుతున్నారు.
తాజాగా ఎపి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ప్రత్యేక హోదా పోరు జరుగుతోంది. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పోరు సభ జరుగుతున్నా సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మునికోటి కిరోసి పోసుకొని తగల పెట్టుకున్నాడు. 42 ఏళ్ళ వయసు కలిగిన మునికోటి చికిత్స పొందుతూ ఈ రోజు చెన్నైలో చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో బాధ పడడమే కాకుండా సంతాపం కూడా తెలిపాడు. ‘మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది; వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ని తెలియ చేస్తున్నాను’ అని పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.