
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ తరహాలోనే పవన్ కళ్యాణ్ మరోసారి అదే యాటిట్యూడ్ తో కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ అన్ని చోట్లా మారు మ్రోగుతోంది. ఇప్పుడు ఆ పాటని మించే విధంగా సర్దార్ లో మరో స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేసాడు దేవీశ్రీ ప్రసాద్. సెప్టెంబర్ 30 నుంచి ఈ పాటని నానక్రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ స్టెప్పులేసిన ఈ పాట షూటింగ్ నేటితో పూర్తయ్యింది. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్త్ అని ఈ చిత్ర టీం చెబుతోంది. ఈ రోజు పేకప్ చెప్పిన ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కి రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పైకంపోజ్ చేసే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో హైదరబాద్ లో న్యూ షెడ్యూల్ ని స్టార్ చేస్తారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి బాబీ దర్శకుడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఓ మేజర్ ఎపిసోడ్ ని గుజరాత్ లో షూట్ చేయనున్నారు.