ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. హిందీ పింక్ చిత్రానికి రీమేక్ గా దీనిని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. చాలానే మార్పులు చేర్పులు చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా అలాగే పవన్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు సాలిడ్ కం బ్యాక్ నే ఆశిస్తున్నారు.
అయితే అనుకోని విధంగా మధ్యలో చాలా కాలం గ్యాప్ ఈ సినిమాకు వచ్చేయడంతో మళ్ళీ పవన్ గెటప్ లో చాలానే చేంజ్ వచ్చేసింది. దీనితో పవన్ ఎలాగో సినిమాలు స్టార్ట్ చేశారు కాబట్టి లుక్ పై కూడా దృష్టి పెట్టాల్సింది అని అంతా అనుకున్నారు. కానీ ఆ లోటును ముఖ్యంగా అభిమానులకు అయితే పూర్తిగా తీర్చేసినట్టే అని చెప్పాలి.
ఆ మధ్య బయటకొచ్చిన హైదరాబాద్ మెట్రో ఫోటోల నుంచి లేటెస్ట్ గా ఆన్ సెట్స్ లో నుంచి బయటకు వచ్చిన ఫోటోలు చూస్తే పవన్ లుక్స్ లో చాలానే మార్పులు గమనించవచ్చు. ఫ్రెష్ లుక్స్ తో పవన్ కనిపిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ చాలా మట్టుకు హ్యాపీ అయ్యిపోయారు. మొత్తానికి మాత్రం పవన్ అప్పటి లోటును ఇప్పుడు తీర్చేసినట్టే అని చెప్పాలి.
