‘ఓజి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

they call him og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే ‘ఓజి’. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డు గ్రాసర్ గా అయితే నిలిచింది. ఈ సినిమా ఓటిటి లోకి వచ్చి కూడా మంచి హిట్ కాగా చాలా గ్యాప్ తర్వాత బుల్లితెర ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఈటీవీ సంస్థ కొనుగోలు చేయగా వీరు ఫైనల్ గా ప్రీమియర్ డేట్ ని అయితే లాక్ చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ స్వాతంత్ర దినోత్సం కానుకగా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. ఆరోజు సాయంత్రం 6 గంటలకి ఈటీవీలో ఓజి మొదటిసారి ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version