మోడీ ట్వీట్ కి స్పందించిన పవన్ కళ్యాణ్

PAwan_modi
మోడీ పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. “ఎంతో ఉత్సాహం గా ఆంధ్ర ప్రదేశ్ అంత ప్రచారం చేసి మాకు ఎంతో తోడ్పడిన పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు” అని మోడీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ ట్వీట్ కి స్పందిస్తూ పవన్ ఒక ప్రకటన జారి చేసారు. ఆ ప్రకటన సారంశం ఇలా వుంది “మోడీ గారు ట్వీట్ లో నన్ను పేర్కొనడం ఆయన గోప్పతనానికి నిదర్శనం. నాకు ఆయన నాయకత్వం మీద చాలా నమ్మకం వుంది. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేసాను. మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పధం లో నడుపుతారని నాకు నమక్కం వుంది. ఆయన దేశ యువత కి ఒక ఆశ ని కల్గించారు. ఒక దారి ని చూపిస్తారు. ఆయన తన పై వున్న బాధ్యత ని విజయవంతంగా నిలబెట్టుకుంటారాని ఆశిస్తున్నాను.”

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. జన సేన పార్టీ ని ప్రారంభించిన కాని ఆయన ఎన్నికల్లో పోటి చేయలేదు. ప్రస్తుతం తెలుగు దేశం మరియు బి. జె. పి అండ తో భవిష్యత్తు లో పవన్ కళ్యాణ్ వెనుతిరిగిచూడరు.

Exit mobile version