
విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనుంటే పవన్ కళ్యాణ్ మోడ్రన్ శ్రీ కృష్ణుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమా అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమే అని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం పవన్ కళ్యాణ్ పాత్ర లెంగ్త్ ని పెంచేశారు.
ప్రస్తుతం ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పాత్ర లెంగ్త్ ని 15 నిమిషాలు పెంచి మొత్తంగా 45 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. త్వరలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.