‘ఓజీ 2’ ప్రస్తావన తెచ్చిన పవన్.. ఖుషీ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

OG

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా దర్శకుడు సుజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై జోరుగా ప్రచారం సాగుతోంది. నానితో చేయాల్సిన ‘బ్లడీ రోమియో’ కంటే ముందే ‘ఓజీ 2’ సెట్స్ పైకి రానుందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ క్రేజీ సీక్వెల్‌పై స్పందించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు మరింత బలాన్ని చేకూర్చాడు.

అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్‌ను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వరంగల్ హనుమకొండకు వెళ్లారు. అక్కడ ఆ కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా గడిపిన ఆయన, తన అభిమానికి అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చారు. కేవలం ఒక సెలబ్రిటీలా కాకుండా ఒక పెద్దన్నలా పవన్ చూపించిన ఈ మానవత్వం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

అయితే ఈ పర్యటనలో నిరంజన్‌తో ముచ్చటిస్తూ పవన్ ‘ఓజి 2’ ప్రస్తావన తీసుకురావడం విశేషం. ‘ఓజి 2 సినిమా తీస్తే నిన్ను స్పెషల్ గెస్ట్‌గా ఈవెంట్‌కి పిలుస్తాను.. మనమిద్దరం కలిసే సినిమా చూద్దాం’ అంటూ పవన్ ఒక క్రేజీ ప్రామిస్ చేశారు. పవన్ నోట ఈ మాట రావడంతో నిరంజన్ కుటుంబం భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇండస్ట్రీ వర్గాలు మరియు అభిమానులు ‘ఓజి 2’ రావడం ఖాయమని ఫిక్స్ అయిపోయి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version