వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Pawan Kalayan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు హీరో గానే కాకుండా డిప్యూటీ సీఎం గా కూడా తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల పహల్గం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన పట్ల పవన్ చాలా చింతించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ కొన్ని లోకల్ నుంచి నేషనల్ వైడ్ గా కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.

ఇలా చేసిన కామెంట్స్ లో ప్రస్తుతం నెలకొన్న విషాద పరిస్థితిలలో ఎవరైనా సంఘవిద్రోహులు కానీ సోషల్ మీడియాలో దేశం పట్ల తప్పుగా మాట్లాడినా పోస్ట్ లు చేసినా సరే వారికి జైలే గతి అని గట్టి వార్నింగ్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజుల్లో పవన్ తన సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు.

Exit mobile version