పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు పాల్గొన్నారు. తర్వాత బెంగుళూరు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమగ్ర సర్వేకు పవన్ కళ్యాణ్ సహకరించలేదు అంటూ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని పవన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
పవన్ బెంగుళూరు నుండి తిరిగి రాగానే ‘గోపాల గోపాల’ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ‘గబ్బర్ సింగ్ 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారు నిర్మాత శరత్ మరార్ మరియు దర్శకుడు సంపత్ నంది. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత తెలిపారు.
