
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే అధికారికంగా నాలుగు సినిమాలకు సైన్ చేసిన ఆయన వాటిలో ‘వకీలీ సాబ్’ను మాత్రమే కంప్లీట్ చేశారు. ఈ చిత్రం కోసం అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయమే పట్టడంతో ఆ ఒత్తిడి మిగిలిన సినిమాల మీద పడింది. పైగా పవన్ కు రాజకీయపరమైన పనులు పెరడగడంతో ఆ ఒత్తిడి డబుల్ అయింది. పవన్ గతంలోనే క్రిష్ చిత్రాన్ని స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ చేశారు. కానీ లుక్స్ పరంగా వేరియేషన్ కుదరక క్రిష్ సినిమాను పక్కనబెట్టాల్సి వచ్చింది.
ఈలోపు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెర మీదకు వచ్చింది. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాకు కూడ పవన్ జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కాల్ షీట్స్ కేటాయించారు. దీంతో క్రిష్ సినిమా ఇబ్బందుల్లో పడ్డట్టైంది. అయితే రెండు సినిమాల్లోనూ లుక్స్ కోర మీసంతో దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి రెండు చిత్రాలను సమాంతరంగా చేసుకుంటూ వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఈమేరకు ఇరు దర్శకులకు, నిర్మాతలకు చెప్పి షెడ్యూల్ వేయించుకున్నారట. అంటే రెండు చిత్రాలను ఆయన ఒకే సమయానికి కంప్లీట్ చేస్తారన్నమాట.