శ్రీజ చివరి కోరిక తీర్చనున్న పవన్ కళ్యాణ్..

pawan-kalyan
విశాఖలో తుఫాన్ భాదితులను పరామర్శించిన ప్రముఖ సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ నుండి ఖమ్మం బయలుదేరారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శ్రీజ అనే 12 ఏళ్ళ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మరికొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుందని వైద్యులు చెప్పారు. తన చివరి కోరికగా అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌ ను చూడాలని ఉందని శ్రీజ చెప్పింది. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీజను కలవడం కోసం ఖమ్మం పయనమయ్యారు. పాల్వంచలో రేపు శ్రీజను పవన్ కలవనున్నారు. రోజులు లెక్కిస్తున్న ఆ చిన్నారి చివరి కోరికను పవన్ నెరవేరుస్తున్నారు.

శ్రీజ చివరి కోరిక తెలుసుకున్న మీడియా పవన్ సన్నిహితులకు ఈ వార్తను చేరవేయడంలో కృషి చేశారు. వారు పవన్ దృష్టికి తీసుకువెళ్ళారు. గతంలో ఒకసారి వరంగల్ యాసిడ్ దాడిలో గాయపడిన స్వప్నిక చివరి కోరిక తీర్చడం కోసం పవన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.

Exit mobile version