తన సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Power-Star-Pawan-Kalyan
‘అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవన్ తదుపరి సినిమాలను అనౌన్స్ చేసినా అవి ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ సమయంలోనే పవన్ ‘జనసేన’ అనే రాజకీయ పార్టీ పెట్టడం, అలాగే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళని చైతన్య వంతులని చేయడానికి ప్రయత్నిచడం చేసారు. ప్రస్తుతం ఆయన బిజెపి తరపున కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లలో ప్రచార బాధ్యతలు చేపట్టారు.

పవన్ అభిమానులంతా రాజకీయాలవైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కావున తను కమిట్ అయి ఉన్న సినిమాలు చేస్తారా? లేదా? అసలు సినిమాలు చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే ఓ చానల్ ఇంటర్వ్యూలో పవన్ ముందు ఈ ప్రశ్న ఉంచితే ఆయన సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

‘కచ్చితంగా సినిమాలు చేస్తాను. ఇప్పుడు కమిట్ అయిన అన్ని సినిమాలు చేస్తాను. అలాగే నాకు సినిమా తప్ప వేరే వ్యాపారాలు లేవు, నాకు సంపాదన సినిమానే, అలాగే నా మీద ఆధారపడిన వాళ్ళు చేలా మంది ఉన్నారు, కాబట్టి సినిమాలు చేస్తాను. తదుపరి రాబోయే ఎన్నికల్లో పోటీచేసే టైం కి ప్రొడక్షన్ లో దిగుతాను. ఒకసారి నాయకుడిగా రాజకీయాల్లోకి వెళ్ళాక మాత్రం సినిమాలు చేయనని’ పవన్ క్లారిటీ ఇచ్చాడు.

దీంతో ఇంకో 5 సంవత్సరాలు పవన్ సినిమాల్లో నటిస్తాడని చెప్పొచ్చు. పవన్ ప్రస్తుతం ‘ఓ మై గాడ్’ రీమేక్, ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Exit mobile version