
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికి కూడా ఆ సినిమాలో పాట వస్తే ఆనందంతో చిందులేస్తారు. ఇదే కాంబినేషన్ మరోసారి కార్యరూపం దాల్చనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడనే వార్త చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇలియానా హీరొయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకి జల్సా 2 అనే అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ వార్త గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము.
పవన్ కళ్యాణ్ జల్సా 2 చేయబోతున్నాడా?
పవన్ కళ్యాణ్ జల్సా 2 చేయబోతున్నాడా?
Published on Mar 21, 2012 8:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?

