వైరల్ అవుతున్న పవన్ లేటెస్ట్ లుక్స్.!

pawan ali

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కాలం అనంతరం చేసిన చిత్రం “వకీల్ సాబ్”. మరి ఈ చిత్రం కి తీసుకున్న గ్యాప్ లో పవన్ పాలిటిక్స్ చేస్తూ కంప్లీట్ గా తన లుక్ ను మార్చేసుకున్నారు. కానీ మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చెయ్యడంతో మేకోవర్ పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. లేకపోతే షూట్ లేని సమయంలో ఎలా ఉంటారో తెలుసు.

కానీ ఈ చిత్రంతో పాటుగా క్రిష్ తో ఓ చిత్రం అలాగే యువ దర్శకుడు సాగర్ కె చంద్రతో మరో రీమేక్ సినిమాలను ప్లాన్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాల్లో మాత్రం పవన్ మరింత స్పెషల్ గా కనిపించడం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఫోటోలు చూసి సోషల్ మీడియాలో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న పవన్ ఓ పెళ్లి ఫంక్షన్ కు హాజరు కాగా అందులో పవన్ యంగ్ లుక్స్ చూసే ఆశ్చర్యపోతున్నారు. ముందు కన్నా కాస్త స్లిమ్ లో కనిపించడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే చాలా కాలం నుంచి గ్యాప్ ఉంది అనుకున్నా ఆలీ తో కూడా బయటకొచ్చిన ఫోటో ఇంకా వైరల్ అయ్యింది.

Exit mobile version