నైట్ షూట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్

నైట్ షూట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్

Published on Aug 10, 2015 8:50 PM IST

pawan-kalyan
దాదాపు 8 నెలలు గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా ‘సర్దార్’ సినిమా షూటింగ్ ని స్టార్ చేసాడు. అలా మొదలెట్టిన పవన్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ని చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. జూలై 28న స్టార్ట్ చేసిన సెకండ్ షెడ్యూల్ ని ఆగష్టు 6 వరకూ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు, పవన్ విలన్స్ కి దమ్కీ ఇచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఈ షెడ్యూల్ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన ఈ చిత్ర టీం నేటి నుంచి మరో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనుంది. అది కూడా డే షూటింగ్ కి కాదండోయ్.. నైట్ ఎఫెక్ట్ షూట్ కోసం సిద్దమయ్యారు.

నేటి నుంచి సర్దార్ సినిమాలో వచ్చే కొన్ని నైట్ ఎఫెక్ట్ సీన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సెట్ ని ఆర్.ఎఫ్.సిలో రెడీ చేసారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం కొన్ని మేజర్ ఎపిసోడ్స్ ని షూట్ చేయడం కోసం గుజరాత్ వెళ్లనుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఫైనలైజ్ చేయగా మరో హీరో కోసం అన్వేషిస్తున్నారు. పవన్ కి పోటీ ఇచ్చే విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ కనిపించనున్న ఈ సినిమాకి ‘పవర్’ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ని కూడా కంపోజ్ చేసేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు