‘రంగస్థలం’ను వీక్షించనున్న పవన్ !

‘రంగస్థలం’ను వీక్షించనున్న పవన్ !

Published on Apr 10, 2018 2:00 AM IST


రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘మగధీర’ తర్వాత అంతటి విజయాన్ని ఈ చిత్రం ద్వారా అందుకోవడం, ఈ సినిమాతోనే పరిపూర్ణ నటుడిగా చరణ్ ఆవిష్కృతమవడంతో చిరంజీవితో పాటు మెగా కుటుంబమంతా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే మెగా హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు అంతా సినిమాను వీక్షించగా పవన్ మాత్రం రాజకీయపరమైన పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఇంతవరకు సినిమాను చూసే వీలు కలగలేదు.

అందుకే ఈరోజు రాత్రి ఆయన హైదరాబాద్లో చిత్ర టీమ్ తో కలిసి సినిమాను వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనతో పాటు రామ్ చరణ్ కూడ సినిమాను చూడనున్నారు. విడుదలైన రెండు వారాలకే పాత రికార్డుల్ని బద్దలుకొట్టిన ఈ చిత్రం సరికొత్త నాన్ బాహుబలి రికార్డుల్ని సెట్ చేయనుంది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, చరణ్ అసామాన్య నటన కలిసి సినిమాను భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాయి.

తాజా వార్తలు