తన కొత్త సినిమా ఫై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

pawan7

అజ్ఞాతివాసి చిత్రం తరువాత సినిమాలకు దూరం అయ్యి పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో విస్త్రుతంగా పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన ఒక చిత్రంలో నటించనున్నారని ఈ వార్తల సారాంశం.

ఇక తాజాగా ఈ వార్తల ఫై పవన్ స్పందిస్తూ నేను సినిమాలో నటించనున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు అంత సమయం లేదు. నా దృష్టి అంత ప్రజా క్షేమం కోసమే, నా తపన అంతా సమాజ స్థాపన కోసమే అంటూ ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ న్యూస్ ఆయన అభిమానులకు నిరాశ కలిగించేదే.

Exit mobile version