మరో ఓటీటీలోకి వస్తున్న జగపతి బాబు ‘వదలా’.. ఎందులో అంటే..?

టాలీవుడ్‌లో రూపొందిన సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ‘వదలా’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జూలై 17న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్రం మరో ఓటీటీలోనూ సందడి చేసేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ‘వదలా’ చిత్రం సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా మరింత మంది ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని వారు తెలిపారు.

అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, శ్రేయ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించాడు. కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. మరి ఈటీవీ విన్‌లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version