కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్

ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. అలానే అప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారిని కృష్ణ గారు ఎంతగా విమర్శించినా ఎన్టీఆర్ గారు తిరిగి ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. అది ఎన్టీఆర్ గారి అంతటి సంస్కారం. అయితే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురి చేశారని అన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలు ఇటీవల ఎంతో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లో కృష్ణ గారిని పవన్ ఎక్కడా విమర్శించలేదని పలువురు జనసేన నాయకులు, పవన్ ఫ్యాన్స్ అంటే, ఎన్నికల వేళ నాటి సూపర్ స్టార్ కృష్ణ గారిని లాగవలసిన అవసరం పవన్ కు ఏమిటనేది కృష్ణ గారు, మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నించారు. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై విజయనిర్మల తనయుడు సీనియర్ నరేష్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మిస్టర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారిని విమర్శించడం చూసి షాక్ అయ్యాను మరియు చాలా బాధపడ్డాను. కృష్ణ గారు బంగారు హృదయం మరియు నైతికత కలిగిన పార్లమెంటేరియన్ అని అన్నారు. సినిమా పరిశ్రమకు అలానే రాజకీయాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన తన రాజకీయ ప్రసంగాల్లో పొత్తులు మార్చుకోలేదు, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తన పోస్ట్ లో తెలిపారు వికె నరేష్.

Exit mobile version